తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా వేములవాడ రాజరాజేశ్వరుని కల్యాణం

ఆదిదేవుడు, శివుని కల్యాణం చూడడానికి భక్తులు వేములవాడకు పోటెత్తారు. మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన వివాహ వేడుకను చూసి భక్తి పారవశ్యంలో పులకించారు.

రాజరాజేశ్వరుని కల్యాణం

By

Published : Mar 23, 2019, 6:45 PM IST

రాజన్న కల్యాణానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జరిగిన వేడుక వీనులవిందు కలిగించింది. మున్సిపల్​ కమిషనర్​ గంగారాం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆర్జిత సేవలు రద్దు

కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాజన్న దర్శనానికి సైతం ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. అధికారులు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనం అమలు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఉపాసన, బలిహరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి :రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details