రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ. 3.45 కోట్లతో సకల సౌకర్యాలతో అధునాతన రైతు బజార్ రూపుదిద్దుకుంటోంది. 2.84ఎకరాల్లో రైతుబజార్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర సరుకుల అమ్మకాల కోసం 106 దుకాణాలను నిర్మించారు. మాంసం, చేపల విక్రయాల కోసం మరో 48 దుకాణాలను నిర్మించారు. రైతు బజార్‌కు వచ్చే వినియోగదారుడికి అన్ని వస్తువులు అందుబాటులో ఉండేలా దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 80 శాతం పనులు పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు.
గదుల్లో నల్లాలు, టైల్స్ ఏర్పాట్లు చేయగా... మరికొన్ని గదుల్లో పనులు కొనసాగుతున్నాయి. వచ్చే వినియోగదారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలు, మూత్రశాలలు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. రైతు బజార్ లోపల 30 అడుగుల వెడల్పుతో అంతర్గత రోడ్లను ఏర్పాటు చేశారు. సిద్దిపేట తరహాలో ఈ రైతు బజార్ ను ఏర్పాటు చేసి త్వరలోనే రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు.
సర్వహంగులతో రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో రైతుబజార్..
సిద్దిపేట తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధునాతన రైతుబజార్ రూపుదిద్దుకుంటోంది. మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.3.45కోట్లతో 2.84ఎకరాల్లో రైతుబజార్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి కృషి చేస్తున్నారు.
సర్వహంగులతో రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో రైతుబజార్..
ఇవీ చూడండి: మేడారం: సౌకర్యాల లేమితో భక్తులకు తప్పని ఇక్కట్లు