నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ.. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితం అని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యత్రుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో కాంగ్రెస్ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేసి, గౌరవ వందనం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని కోక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకునూరి బాలరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా క్విట్ ఇండియా దినోత్సవం - క్విట్ ఇండియా డే వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో క్విట్ ఇండియా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేశారు.
ఘనంగా క్విట్ ఇండియా దినోత్సవం