గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికులు నిరసనకు దిగారు.
సుమారు 46 వేల మంది..
రాష్ట్ర వ్యాప్తంగా 12,750 గ్రామ పంచాయతీల్లో 46 వేల మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు. అందరూ, కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, ఫుల్ టైం పద్ధతుల్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.