తమ భూమిని అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారి పేరు మీదకు మార్చుకున్నారని ఓ కుటుంబం రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన కాంభోజి వెంకట నర్సయ్యకు 1009/సీ/2 సర్వే నంబర్లో 20 గుంటల భూమి ఉంది.
దీంతోపాటు కొత్త పాస్బుక్ రైతుబంధు డబ్బులు కూడా వస్తున్నాయి. అయితే వెంకట నర్సయ్య 27 జులై 2020న మరణించాడు. అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన భిన్నవేని భాగయ్య రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆ భూమిని మార్పిడి చేసుకున్నాడని బాధితులు వాపోయారు.