తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడంపై పొన్నం ఆగ్రహం - ponnam prabhakar was stopped at grain buying centres in mustabad

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​లో కొనుగోలు కేంద్రాలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ సందర్శించడానికి వెళ్లగా.. ఆయన్ను పోలీసులు అడ్డకున్నారు. జీవోల పేరుతో ప్రతిపక్షనాయకులను ప్రజల్లో తిరగనివ్వకపోవడంపై పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ponnam-prabhakar-was-stopped-at-grain-buying-centres-in-mustabad
ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడంపై పొన్నం ఆగ్రహం

By

Published : May 16, 2020, 11:58 AM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు... అధికారపక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉంటుందా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వెళ్లిన పొన్నంను పోలీసులు అనుమతించకపోవడంతో స్థానిక కాంగ్రెస్‌ నేతల ఇంట్లో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.

ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తుంటే... తమను పోలీసు చర్యలతో అడ్డుకుంటున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. జీవోల పేరిట ప్రతిపక్షనాయకులు ప్రజల్లో తిరగకుండా చేస్తున్నారని దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడంపై పొన్నం ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details