రైతులు పండించిన వరిధాన్యాన్ని రూ.2,500 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లింగంపల్లి గ్రామంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కోటి సంతకాల సేకరణ - congress sign gathering against agricultural bill
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా లింగంపల్లి గ్రామంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కోటి సంతకాల సేకరణ
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి వరి సాగు తగ్గించి సన్నాలు పండించిన రైతులకు సరైన మద్దతు ధర ప్రకటించి.. వారిని ఆదుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను అంచనా వేసి పరిహారం ఇవ్వకపోవడమేంటని పొన్నం ప్రశ్నించారు. రైతులకు కొత్త రెవెన్యూ చట్టం వల్ల ఒరిగిందేమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతులకు సరైన మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయాలన్నారు.
ఇవీ చూడండి:సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్