రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు కరీంనగర్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు మద్దతుగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జీవ నది లాంటిదని ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడినా.. ఇబ్బంది లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్‌ను మట్టుపెట్టాలనుకుంటే... జీవన్ రెడ్డిని గెలిపించి పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. తనని ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను విజయం సాధిస్తే సాయం చేసిన కార్యకర్తలందరినీ... ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా గెలిపిస్తానని హామీ ఇచ్చారు.
'ఎమ్మెల్యేలు ఉప్పునీటిలో కలిసి కలుషితమవుతున్నారు' - KCR
'కాంగ్రెస్ పార్టీ జీవనదిలాంటిది. ఎంతమంది వచ్చి చేరినా... ఎంత మంది పార్టీని వీడినా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా మంచి నీటి నుంచి వెళ్లి పనికి రాని ఉప్పునీటిలో కలిసి కలుషితమవుతున్నారు': పొన్నం ప్రభాకర్
'ఎమ్మెల్యేలు ఉప్పునీటిలో కలిసి కలుషితమవుతున్నారు'