రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి సిరిసిల్ల, వేములవాడ ప్రధాన రహదారి పక్కన ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి అలుగులు పారుతోంది. దానితో వరద నీరు రోడ్డుపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగడం వల్ల స్థానిక పోలీసులు స్పందించారు. కొత్త చెరువు కట్ట వద్దకు చేరుకుని వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలందించారు. మరికొంత మంది మైక్ ద్వారా సూచనలిస్తూ.. వాహనాదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు.
రోడ్డుపై వరద నీరు.. ప్రజలకు సేవలందించిన పోలీసులు - రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు
సిరిసిల్ల జిల్లాలో కురుస్తోన్న వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. దీనితో వాహనాదరులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పందించిన పోలీసులు..
రోడ్డుపై వరద నీరు.. ప్రజలకు సేవలందించిన పోలీసులు