మంత్రి కేటీఆర్ పర్యటనలో ఓ కానిస్టేబుల్, మహిళా ఎస్సై మధ్య స్వల్వ వాగ్వాదం తలెత్తింది. బందోబస్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మాజీ ప్రతినిధి వాహనాన్ని అనుమతించే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
మంత్రి కేటీఆర్ పర్యటనలో కానిస్టేబుల్, మహిళా ఎస్సై మధ్య వాగ్వాదం - కానిస్టేబుల్
ఓ కానిస్టేబుల్, ఎస్సై మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ మాజీ ప్రజాప్రతినిధి వాహనాన్ని అనుమతించే విషయంలో గొడవ తలెత్తింది. ఈ ఘటన మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో జరిగింది.

మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి పర్యటనకు వస్తుండగా అక్కడే గేటు ముందు వేములవాడకు చెందిన కానిస్టేబుల్ మహేందర్ విధుల్లో ఉన్నారు. అదే సమయంలో ముస్తాబాద్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి వాహనంలో వచ్చారు. అయితే ఆ వాహనాన్ని కానిస్టేబుల్ మహేందర్ లోపలికి అనుమతించలేదు. అక్కడే ఆసుపత్రి ఆవరణలో ఉన్న మహిళా ఎస్సై అపూర్వ రెడ్డి వాహనాన్ని పంపించాలని అతనికి సూచించారు. అయితే అందుకు నిరాకరించిన కానిస్టేబుల్ డ్యూటీ ఇంఛార్జి రామచంద్రం చెబితేనే అనుతిస్తానని తెగేసి చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అయితే తన విధి నిర్వహణలో అంత నిక్కచ్చిగా మాట్లాడిన మహేందర్‌ను మాస్కు ఎందుకు ధరించలేదని తోటి ఉద్యోగులు ప్రశ్నించారు.
ఇదీ చూడండి:KTR: 'ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం'