చట్టాన్ని రక్షిస్తూ సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా కాపాడుతున్న వ్యవస్థ పోలీస్ శాఖ అని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ ఆర్ కృష్ణ భాస్కర్ అన్నారు. చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబాలు తమ వారిని గుర్తుచేసుకుంటూ కంటతడిపెట్టుకున్నారు.
లింగంపేటలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం - పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా లింగంపేటలో పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.
లింగంపేటలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం