తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు - రాజన్న సిరిసిల్ల వార్తలు

ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించాలని కోరుతూ భాజపా నాయకులు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని దీక్షా శిబిరంపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Police breaks the BJP hunger strike for govt hospital  in illanthakunta mandal in rajanna  sircilla district
భాజపా నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

By

Published : Feb 15, 2021, 5:05 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మిస్తామని మూడేళ్ల క్రితం మంత్రి కేటీఆర్​ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ భాజపా నాయకులు ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష శిబిరంపై దాడి చేసిన పోలీసులు భాజపా కార్యకర్తలను పీఎస్​కు తరలించారు.

నిరుపేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిరాహార దీక్ష చేపట్టామని భాజపా నాయకులు పేర్కొన్నారు. పోలీసులతో దీక్షను భగ్నం చేయడం వల్ల పలువురికి గాయాలయ్యాయని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే గొంతులను తెరాస ప్రభుత్వం పోలీసులతో కట్టడి చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని భాజపా నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :'కేసీఆర్​ పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు'

ABOUT THE AUTHOR

...view details