తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలకు అనుమతి రద్దు - telangana varthalu

కరోనా వైరస్​ విజృంణ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఐదురోజుల పాటు అన్ని రకాల పూజలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

Rajanna temple
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలకు అనుమతి రద్దు

By

Published : Apr 17, 2021, 3:56 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు వెల్లడించారు. దేవాలయంలో ఈ నెల 18 నుంచి 22 వరకు... ఐదు రోజుల పాటు భక్తుల దర్శనం, కోడె మొక్కులు, ఇతర అన్ని రకాల మొక్కుబడి పూజలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 21న రాజన్న సన్నిధిలో జరగనున్న సీతారాముల కళ్యాణం, స్వామివారి నిత్య పూజలు, రథోత్సవం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారి హరికిషన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బీ అలర్ట్: రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు

ABOUT THE AUTHOR

...view details