రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో బండారు కావేరి ఆరో తరగతి చదువుతోంది. కుటుంబ అర్థిక పరిస్థితులు బాగా లేక తల్లిదండ్రులపై బెంగతో వసతి గృహంలో ప్రతి రోజు ఏడ్చుకుంటూ ఉండేది. విసిగిపోయిన ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థినిని మందలించి ఇంటికి పంపించింది. ఇంటికి వెళ్లిన ఆ విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొట్టిందని తలకు గాయాన్ని చూపించింది. కోపోద్రిక్తులయిన కుటుంబ సభ్యులు బంధువులుతో సహా పాఠశాలకు వచ్చి ధర్నా చేశారు.
పాపే తలను గోడకు బాదుకుంది
స్పందించిన పాఠశాల అధికారి అశోక్ రావు... ఇంటిపై బెంగ, తల్లిదండ్రుల ఆర్థిక, అనారోగ్య పరిస్థితులను తలచుకుంటూ కావేరి ప్రతిరోజు ఏడుస్తుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. నిన్న కూడా తల్లికి ఫిట్స్ ఉందంటూ తరగతి గదిలోనే చాలా సేపు ఏడ్చిందని... ఇతర పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉపాధ్యాయురాలు మందలించిందని తెలిపారు. కోపంతో కావేరి తలను గోడకు గుద్దుకోవడం వల్ల స్వల్ప గాయమైందని... పాప ఇంటికి వెళ్తానని చెప్పగానే ఇంటికి పంపించినట్లు తెలిపారు. ఇదివరకు కూడా కావేరి ఇలాగే చేసిందని తెలిపారు.
తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది.. ఇవీ చూడండి: పశువైద్యురాలి ఘటన మరవకముందే...