తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో వానరం మృతి - కోతి

కిచకిచమని పాడుతూ... ఆనందంగా ఎగురుతూ జనారణ్యంలోకి వచ్చిందో వానరం. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి స్తంభంపైనే ప్రాణాలు విడిచింది.

విద్యుదాఘాతంతో వానరం మృతి

By

Published : Jul 30, 2019, 7:44 PM IST

అరణ్యంలో నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ వానరం ప్రమాదవశాత్తు మృత్యవాతపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలోని శివనగర్ భవనం పైనుంచి చెట్టుపైకి దూకేందుకు ప్రయత్నించింది. దురదృష్టవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు ఆనుకొని ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరారు.

విద్యుదాఘాతంతో వానరం మృతి

ABOUT THE AUTHOR

...view details