తెలంగాణ

telangana

ETV Bharat / state

కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు... అయిదు రోజుల తర్వాత దారికొచ్చింది - వాగులో బస్సును వెలికితీసిన అధికారులు

డ్రైవర్ అజాగ్రత్త కారణంగా వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సును ఎట్టకేలకు వెలికితీసారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శివారు మానేరు వాగులో గత నెల 30న చిక్కుకున్న బస్సు... ప్రయాణికులంతా బయటపడిన తర్వాత ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయింది.

bus
bus

By

Published : Sep 3, 2021, 5:37 PM IST

Updated : Sep 3, 2021, 5:54 PM IST

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శివారు మానేరువాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సును అధికారులు వెలికితీశారు. భారీ క్రేన్​​ ఉపయోగించి అయిదు రోజుల తర్వాత బస్సును బయటకు తీశారు.

డ్రైవర్​ అత్యుత్సాహంతో..

గతనెల 30న సిద్దిపేటకు చెందిన ఆర్టీసీ బస్సు 23మంది ప్రయాణికులతో మానేరు వాగుపై ఉన్న లోలెవల్​ వంతెనపై వెళ్తుండగా.. ప్రవాహ ఉద్ధృతికి వంతెన మధ్యలో చిక్కుకుపోయింది. ప్రయాణికులు కేకలు వేయడంతో... స్థానిక రైతులు వారిని కాపాడారు. ప్రవాహ ఉద్ధృతి పెరగడం వల్ల బస్సు కొట్టుకుపోయింది.

వాగు మధ్యలో రాళ్లమధ్య చిక్కుకున్న బస్సును వెలికి తీసేందుకు గతంలోనే ప్రయత్నించగా ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల సాధ్యం కాలేదు. ఇవాళ వాగు ఉద్ధృతి తగ్గిన తరువాత భారీ క్రేన్​ సాయంతో బయటకు తీశారు. మొత్తం మీద అయిదు రోజుల తర్వాత ప్రవాహంలో చిక్కుకున్న బస్సు రోడ్డు మీదకు వచ్చింది.

కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు... అయిదు రోజుల తర్వాత దారికొచ్చింది

ఇదీ చూడండి:RTC Bus Wrecked: చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు

Last Updated : Sep 3, 2021, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details