తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా సంచార బయో శౌచాలయ వాహనాన్ని రూపొందించారు. రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలంగాణ పర్యాటక శాఖకు చెందిన బస్సును రూ.7.50 లక్షలకు కొనుగోలు చేసి అందులో రూ.12.50 లక్షలతో పలు సౌకర్యాలు సమకూర్చారు. నాలుగు మరుగుదొడ్లు, చిన్నపిల్లలకు పాలు పట్టేందుకు ఫీడింగ్ గది, గది బయట వేచి ఉండేవారికి రెండు కుర్చీలు, సెల్‌ఫోన్ ఛార్జింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. బస్సు వెనుక భాగంలో తినుబండారాలు, టీ విక్రయాలకు వీలుగా దుకాణం ఏర్పాటు చేశామని, దీనికి డ్రైవర్, నిర్వాహకుడిని నియమించనున్నామని సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్ కె.సమ్మయ్య తెలిపారు.
సంచార శౌచాలయం.. మహిళలకు సదుపాయం - రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళల కోసం సంచార శౌచాలయం ఏర్పాటు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా సంచార బయో శౌచాలయ వాహనాన్ని రూపొందించారు. ఆ వాహనంలో నాలుగు మరుగుదొడ్లతో పాటు చిన్న పిల్లలకు పాలు పట్టేందుకు ఫీడింగ్ గదిని కూడా ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్ కె.సమ్మయ్య తెలిపారు.

సంచార శౌచాలయం.. మహిళలకు సదుపాయం