తెలంగాణ

telangana

ETV Bharat / state

Women in Handloom Sector: "పురుషులతో సమానంగా పనిచేస్తున్నా గుర్తింపు లేదు" - no Identity cards for women till now in the handloom sector

Women in Handloom Sector: మగవారితో సమానంగా వాళ్లూ పని చేస్తున్నారు. మంచి నైపుణ్యంతో కొత్త కొత్త డిజైన్లు నేస్తున్నారు. అటు కుటుంబాన్ని ఇటు పనిని సమర్థంగా నిర్వహిస్తున్నా వారికి పురుషులతో సమానమైన గుర్తింపు మాత్రం లేదు. నేత వృత్తిలో భర్తలతో సమానంగా శ్రమిస్తున్నా ఫలితం మాత్రం సమానంగా ఉండట్లేదు. ఇప్పటికైనా తమను కార్మికులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆ వృత్తినే నమ్ముకున్న మహిళలు.

Women in Handloom Sector
చేనేత రంగంలో మహిళా కార్మికులు

By

Published : Mar 8, 2022, 4:09 PM IST

Women in Handloom Sector: సిరిసిల్లలో ఏ ఇంటి గడప తొక్కినా... మరమగ్గాల చప్పుల్లే వినిపిస్తాయి. ఎక్కువ మంది నేత వృత్తినే నమ్ముకుని అందులోనే ఉపాధి పొందుతుంటారు. భర్తలతో సమానంగా భార్యలూ బట్టలు నేస్తారు. పురుషులు చేసే ప్రతి పనినీ మహిళలూ నిర్వర్తిస్తారు. పింజర్లపై చీరలు నేయడం, టాకాలు పట్టడం సహా అన్నింటిని ఎంతో నైపుణ్యంతో నిర్వర్తిస్తుంటారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు వచ్చినప్పటి నుంచి నేత వృత్తిలో మహిళల సంఖ్య మరింతగా పెరిగింది. ఇంత పని చేసినా... పురుషులతో సమానమైన గుర్తింపు తమకు లేదని అంటున్నారు మహిళలు.

గుర్తింపు లేదు

సంవత్సరాల తరబడి చేనేత వృత్తిలో ఇప్పటికీ... మహిళలను నేత కార్మికులుగా గుర్తించడంలేదు. చేనేత, జౌళి శాఖలో ఇప్పటి వరకు పురుషులనే కార్మికులుగా నమోదు చేస్తున్నారు. ఇక నుంచి మహిళలకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

సమానంగా పనిచేస్తున్నాం

చేనేత వృత్తిలో మహిళలకు గుర్తింపు దక్కడం లేదని.. పురుషులతో సమానంగా పని చేస్తున్నామని చెబుతున్నారు. చేనేత వృత్తిలో ప్రతి పనినీ మహిళలు చేయగలుగుతున్నా.. చేనేత, జౌళి శాఖలో పురుషులనే కార్మికులుగా అధికారులు గుర్తించడం బాధాకరం. దీంతో తమనూ కార్మికులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

"నా పేరు రూప. ఐదేళ్లుగా బతుకమ్మ చీరలను నేస్తున్నాం. ప్రతి యేటా బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి పొందుతున్నాం. అన్ని పనులూ చేస్తున్నాం. అయిప్పటికీ మమ్మల్ని కార్మికులుగా గుర్తించడం లేదు. మాకూ గుర్తింపు కార్డులు ఇవ్వాలని.. కార్మికులుగా గుర్తించాలని చేనేత, జౌళి శాఖను కోరుతున్నాం." -రూప, రాజన్న సిరిసిల్ల జిల్లా

ఇదీ చదవండి: Women's day Celebrations: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవం.. నారీమణులకు సన్మానం

ABOUT THE AUTHOR

...view details