రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్‌లో మౌలిక వసతులు కల్పించాలని యజమానులు, కార్మికులు దశాబ్దకాలంగా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి 13.47 కోట్ల నిధులను మంజూరు చేశారు.
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌కు కొత్త కళ - KTR NEWS
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఆధునిక హంగులతో కళకళలాడుతోంది. 13.47 కోట్ల రూపాయలతో పదేళ్ల క్రితం మొదలైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌కు కొత్త కళ
వాటితో టెక్స్టైల్ పార్కులో పరిపాలనా భవనంతో పాటు కార్మికుల కోసం ఆధునాతన హంగులతో క్యాంటిన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. క్యాంటీన్లో ఒకేసారి మూడు వందల మంది కార్మికులు భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ అభివృద్ధి పనులను త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు అధికారులు, వస్త్ర వ్యాపారులు తెలిపారు.
ఇవీ చూడండి : నేడే జీఎస్టీ మండలి 38వ సమావేశం.. అంచనాలు ఇవే!