నాగుల పంచమి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శివాలయాలు, నాగదేవత ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. మహిళలు తెల్లవారుజామునే పుట్ట దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శివాలయాల్లోని నాగపాము ప్రతిమ వద్ద కానుకలు సమర్పించి దీపారాధన చేశారు. శివ నామస్మరణతో ఆలయప్రాంగణాలు మార్మోగాయి.
పుట్టలో పాలు పోసేందుకు తరలివచ్చిన భక్తులు - పుట్టలో పాలు పోసేందుకు తరలివచ్చిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడకలను మహిళలు ఘనంగా నిర్వహించారు.

పుట్టలో పాలు పోసేందుకు తరలివచ్చిన భక్తులు