తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న సన్నిధిలో గంగవ్వ.. అభిమానులతో సెల్ఫీలు - మై విలేజ్​ షో ఫేమ్​ గంగవ్వ వార్తలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 'మై విలేజ్​ షో' ఫేమ్​ గంగవ్వ.. వేములవాడ రాజన్న స్వామిని దర్శించుకున్నారు. గంగవ్వతో సెల్ఫీలు దిగేందుకు ఆలయ ప్రాంగణంలోని భక్తులు ఆసక్తి కనబరిచారు. స్వామి వారి దర్శనం బాగా జరిగిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

gangavva in vemulawada
వేములవాడలో గంగవ్వ

By

Published : Mar 13, 2021, 7:52 PM IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని 'మై విలేజ్​ షో' ఫేమ్​ గంగవ్వ దర్శించుకున్నారు. అనంతరం గంగవ్వకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. రాజన్న దర్శనానికి వచ్చిన గంగవ్వతో భక్తులు, అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.

ఇరవై ఏళ్ల క్రితం రాజన్న దర్శనానికి వచ్చానని, మళ్లీ 15 రోజుల వ్యవధిలోనే స్వామి వారిని దర్శించుకునే అవకాశం రావడం అదృష్టంగా ఆమె భావించారు. రాజన్న ఆశీస్సులు అందరిపై ఉంటాయని తెలిపారు. హెలికాప్టర్​లో వేములవాడకు రావడం మంచి అనుభూతి కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు.

రాజన్న సన్నిధిలో గంగవ్వ.. అభిమానులతో సెల్ఫీలు

ఇదీ చదవండి:నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details