తెలంగాణ

telangana

ETV Bharat / state

'కన్నీరు కారిన చోటే ఆనందభాష్పాలు'

తనదైన పంచ్​ డైలాగ్​లతో స్పీచులు ఇచ్చే కేటీఆర్​... ట్విట్టర్​ వేదికగా ఉద్వేగపూరితమైన కవిత పంచుకున్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తదీ...? అంటూ ఎక్కుపెట్టిన ప్రశ్నకు... తన కవితతో పాటు కొన్ని చిత్రాలను సమాధానంగా చూపించారు. ఆహ్లాదకరమైన ముస్తాబాద్​ పెద్దచెరువు ఫొటోలు ఆనందభాష్పాలు తెప్పించాయని హర్షం వ్యకం చేశారు.

Mustabad Tank filled by water Kaleshwaram waters in mid summer
ముస్తాబాద్ పెద్ద చెరువు

By

Published : Apr 7, 2021, 12:37 PM IST

కన్నీరు కారిన చోటే గంగ పరవళ్లు తొక్కి ఆనంద భాష్పాలు కురిపించిందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆనందంతో చెరువులో చిన్నారి జలకాలాట

మండు వేసవిలోనూ కాళేశ్వరం జలాలతో చెరువులు ఉప్పొంగుతున్నాయని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీటితో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువు నిండుకుండలా మారటం పట్ల ట్విట్టర్​ ద్వారా ఆనందం వ్యకం చేశారు. అలుగు పారుతున్న ముస్తాబాద్​ చెరువుకు సంబంధించి కొన్ని ఆహ్లాదకరమైన చిత్రాలను పంచుకున్న మంత్రి... ఈ సన్నివేశం ఆనంద భాష్పాలు కురిపించిందని పేర్కొన్నారు.

ముస్తాబాద్​ పెద్దచెరువు వద్ద సుందరమైన సుర్యాస్తమయం
అలుగు పారుతున్న ముస్తాబాద్​ పెద్ద చెరువు
అలుగు వద్ద స్థానికుల సందడి

ఇదీ చూడండి: దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details