తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్ జిల్లా​ వ్యాప్తంగా జోరుగా నామినేషన్లు - latest news on municipal elections in joint karimnagar

రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం పురపాలక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. మొదటి రోజైన బుధవారం అభ్యర్థులు ఉత్సాహంగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మున్సిపల్​ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో తొలిరోజు 58 నామినేషన్లు దాఖలయ్యాయి.

muncipal elections news on joint karimnagar district
ఉమ్మడి కరీంనగర్ జిల్లా​ వ్యాప్తంగా జోరుగా నామినేషన్లు

By

Published : Jan 9, 2020, 1:40 PM IST

రాష్ట్రంలో పురపాలక ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్​ విడుదల కావడంతో నామినేషన్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో తొలిరోజు నామినేషన్లు జోరుగా సాగాయి.

కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్​, జమ్మికుంట 2 పురపాలక సంఘాలు ఉండగా.. మొదటి రోజు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో హుజూరాబాద్​లో 11 నామినేషన్లు దాఖలవగా... జమ్మికుంటలో 10 నామినేషన్లు దాఖలయ్యాయి.

జగిత్యాలలో...
జగిత్యాల మున్సిపాలిటీలో 48 వార్డులకు గానూ తొలిరోజు నామినేషన్ల దాఖలుకు అంతగా స్పందన కనిపించలేదు. రేపటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

పెద్దపల్లిలో...

పెద్దపెల్లి జిల్లాలో 2 పురపాలక సంఘాలు ఉండగా.. మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లి పురపాలికలో 36 వార్డులకు గానూ 5 నామినేషన్లు, సుల్తానాబాద్ పురపాలిక​లో 15 వార్డులకు గానూ 2 నామినేషన్లు దాఖలయ్యాయి.

రాజన్న సిరిసిల్లలో...

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీలో 39 వార్డులకు గానూ అధికారులు 13 నామినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు 19వ వార్డు నుంచి అన్నారం శ్రీనివాస్​, 6వ వార్డు నుంచి గొల్లపల్లి రామానుజన్​లు తెరాస తరఫున నామినేషన్​ దాఖలు చేయగా.. 38 వార్డు నుంచి రిక్కుమల్ల సంపత్​, 2వ వార్డు నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి మడుపు శ్రీదేవి నామినేషన్​లు దాఖలు చేశారు.

హుస్నాబాద్​లో...

పూర్వపు కరీంనగర్​ జిల్లాలోని హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గానూ మొదటి రోజు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెరాస నుంచి 6, కాంగ్రెస్​ నుంచి 9, భాజపా నుంచి 1, 1 స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు​ వేశారు.

తెరాసలో ఎక్కువ మంది ఆశావాహులు పార్టీ టికెట్లు ఆశిస్తుండడం వల్ల అభ్యర్థుల ఎంపికలో తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా చివరి రోజైన శుక్రవారం నామినేషన్లు అధికంగా దాఖలయ్యే అవకాశం ఉంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా​ వ్యాప్తంగా జోరుగా నామినేషన్లు

ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details