సిరిసిల్లలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో అమ్మాయిలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనను ప్రభుత్వం చిన్నదిగా చేసి చూపించి... కంటితుడుపు చర్యలు చేపడుతోందని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హాస్టల్ సముదాయాన్ని సందర్శించిన ఎంపీ... జరిగిన ఘటన గురించి విద్యార్థులను అడిగితెలుసుకున్నారు. మౌళిక సౌకర్యాలను పరిశీలించారు.
'కంటి తుడుపు చర్యలు కాదు... కఠిన శిక్షలు వేయాలి' - తెరాస ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు
ఏదైనా ఓ ఘటన జరిగాక స్పందిచటం ఎంత ముఖ్యమో.... అది జరకుండా చర్యలు తీసుకోవటమూ అంతే ముఖ్యమని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. సిరిసిల్లలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఎంపీ... నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవటంపై మండిపడ్డారు.
!['కంటి తుడుపు చర్యలు కాదు... కఠిన శిక్షలు వేయాలి' MP BANDI SAJAYKUMAR COMMENTS ON SIRICILLA SC HOSTEL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6083882-thumbnail-3x2-ppp.jpg)
MP BANDI SAJAYKUMAR COMMENTS ON SIRICILLA SC HOSTEL
విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారని, ఇంత పెద్ద ఘటన చోటుచేసుకున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు ఉండటం దారుణమని సంజయ్‌కుమార్ మండిపడ్డారు. ఇలాంటి కేసును నీరుగార్చేలా వ్యవహరించడం సరియైంది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
'కంటి తుడుపు చర్యలు కాదు... కఠిన శిక్షలు వేయాలి'
ఇవీ చూడండి:శంషాబాద్‌లో 1100 గ్రాముల బంగారం పట్టివేత