ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి కానరాని దేశం వెళితే అక్కడ ఉపాధి లేక అప్పులపాలై స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించి అందరి చేత లొట్టలేయిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన బట్టు బాలకిషన్.. సొంతగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. అందరిలా కాకుండా అందరినీ ఆకర్షించేలా చేయాలని సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.
తనకొచ్చిన ఆలోచనకు తను నూతనంగా కొనుగోలు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌నే ప్రధాన వేదికగా మార్చుకున్నాడు. రూ.రెండు లక్షలతో కొన్న తన బైక్‌కు మరో లక్ష పెట్టుబడి పెట్టి.. రాయల్ ఎన్ఫీల్డ్ను ఓ మొబైల్ హోటల్‌గా మార్చేశాడు.