రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక, విలాసాగర్, కోరెం గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూమిపూజ చేశారు. రైతు వేదికలకు సరిపడా స్థలం లేని గ్రామాల్లో దాతలు తమ భూములిచ్చి ఉదారతను చాటుకున్నారని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో రూ. 30 వేల కోట్లతో రైతుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. రూ.1300 కోట్లతో రూ.25వేల లోపు రైతు రుణాలను మాఫీ చేసిందన్నారు.
'కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయంపై ఆశాజనక పరిస్థితి' - mla sunke ravi shanker
కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయంపై ఆశాజనక పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక, విలాసాగర్, కోరెం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన రైతు వేదికల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
mla sunke ravi shanker visited in rajanna siricilla
గతంలో చొప్పదండి నియోజకవర్గం రైతులు సాగు నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడేవారని... పొట్టకూటి కోసం వలసలు వెళ్లేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ గోదావరి నది జలాలు వినియోగంలోకి తెచ్చి వ్యవసాయంపై ఆశాజనక పరిస్థితి కల్పించారని కొనియాడారు. ఎత్తిపోతల జలాలతో చొప్పదండి నియోజకవర్గంలో కరవు పారిపోయిందని ఎమ్మెల్యే తెలిపారు.