రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని కొదురుపాక వంతెనను.. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి సందర్శించారు. బ్రిడ్జిపై తరచూ ఆత్మహత్య ఘటనలు జరుగుతుండటంతో.. రక్షణ ఏర్పాట్లకు ఆయన ప్రతిపాదనలు చేశారు.
'కొదురుపాక వంతెనపై ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం' - ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో.. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి పర్యటించారు. మానేరు ప్రాజెక్టు కొదురుపాక వంతెనను వారు సందర్శించారు. బ్రిడ్జిపై తరచూ ఆత్మహత్య ఘటనలు జరుగుతుండటంతో.. రక్షణ ఏర్పాట్లకు ఆయన ప్రతిపాదనలు చేశారు.
వంతెనపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని.. జిల్లా కలెక్టర్, ఈఎన్సీలకు లేఖలు రాశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సత్వరం టెండరు నిర్వహించి బ్రిడ్జిపై రక్షణ చర్యలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రూ. 5 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు.. నివేదికను సిద్ధం చేసి పంపాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆత్మహత్య చేసుకోవద్దని రవిశంకర్ కోరారు. ధైర్యంగా ఉండి జీవించాలని సూచించారు.
ఇదీ చదవండి:భగత్‌ను గెలిపిస్తే కోటిరెడ్డికి ఎమ్మెల్సీ: సీఎం కేసీఆర్