రాజన్న సిరిసిల్ల్ జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన 71 మందికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రూ.71 లక్షల 8వేల రూపాయల విలువ చేసే చెక్కులను ఆయన అర్హులకు అందజేశారు.
అర్హులకు చెక్కులు పంచిన ఎమ్మెల్యే సుంకె రవి - ఎమ్మెల్యే సుంకె రవి
వివిధ పథకాల కింద అర్హులైన వారికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెక్కులు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన 71 మందికి ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. సీఎం కేసీఆర్ పేదల ప్రజల కోసం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, వృద్ధాప్య పింఛన్లు ప్రజల అవసరాలకు ఉపయోగ పడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో వ్యవసాయ రంగానికి అండగా నిలిచారన్నారు. నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి..అంధుల కోసం రూ.5తో పరికరం... వరించిన జేమ్స్డైసన్- 2020 పురస్కారం