అన్నపూర్ణ జలాశయంలో ముంపునకు రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి నిర్వాసితుల పునరావాసాలను కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యవేక్షించారు. అనంతగిరి గ్రామస్థులు తమ భూములు త్యాగాలు చేయడం మరువలేనని ఎమ్మెల్యే కొనియాడారు. రెండు రోజుల్లో మద్య మానేరు జలాశయం నుంచి సర్జ్ పూల్ ద్వారా అనంతగిరి జలాశయంలోకి కాళేశ్వరం జలాలు తరలి వస్తున్నాయన్నరు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అంతా సిద్ధం చేశారని తెలిపారు.
'అనంతగిరి నిర్వాసితులను అన్ని రకాలా ఆదుకుంటాం'
అనంతగిరి నిర్వాసితులను ప్రభుత్వం అన్ని రకాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మించిన అన్నపూర్ణ జలాశయంలో ముంపునకు గురవుతున్న అనంతగిరి గ్రామస్థులకు పునరావాసం కల్పించగా... ఏర్పాట్లను కలెక్టర్‌తో కలిసి పర్యవేక్షించారు.
MLA RASAMAI BALAKISHAN PROMISE TO ANANTHAGIRI EXPATS
మొదటగా లోతట్టులో ఉన్న ఎస్సీ కాలనీ ముంపునకు గురవుతున్న క్రమంలో నిర్వాసితులు వెంటనే పునారావాసాలకు తరలి వెళ్లాలని సూచించారు. కొందరు నిర్వాసితులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా... ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పునరావాసాల్లో నివాసాలను పర్యవేక్షించి పూర్తి సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.