కీర్తిశేషుల స్మారకార్థం క్రీడలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామంలో ఎల మల్లవ్వ స్మారకార్థం ఎల రాజు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'స్మారకార్థం క్రీడల నిర్వహణ అభినందనీయం' - ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తాజా వార్తలు
రాజన్న సిరిసిల్ల జిల్లా జవారిపేట గ్రామంలో నిర్వహించిన క్రీడల బహుమతి ప్రదానోత్సవంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. వివిధ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన ఆటగాళ్లకు ఆయన బహుమతులు అందజేశారు.
ఈ క్రీడల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన చెస్, షటిల్, టెన్నికాయిట్, ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన ఆటగాళ్లకు బహుమతులను ఎమ్మెల్యే బాలకిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ అన్నాడి అనంతరెడ్డి, ఎస్సై రఫీక్ ఖాన్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం: సబితా ఇంద్రా రెడ్డి