తెలంగాణ

telangana

ETV Bharat / state

చెన్నమనేని పౌరసత్వం రద్దు ఉత్తర్వులపై స్టే పొడిగింపు - చెన్నమనేని రమేశ్‌

చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వం వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేనికి ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని ఉన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. జర్మనీ పౌరసత్వాన్ని తాను వదులుకున్నానని ధర్మాసనానికి చెన్నమనేని నివేదించారు. అందుకు సంబంధించిన అధికారిక పత్రాలు సమర్పించాలని చెన్నమనేనిని న్యాయస్థానం ఆదేశించింది.

chennamaneni
chennamaneni

By

Published : Feb 10, 2020, 6:00 PM IST

Updated : Feb 10, 2020, 10:36 PM IST

జర్మనీ పౌరసత్వం వదులుకున్నట్లయితే.. అక్కడి అధికార వర్గాల నుంచి డాక్యుమెంట్లు సమర్పించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తన భారత పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. చెన్నమనేనికి ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. చెన్నై నుంచి జర్మనీకి జర్మనీ పాస్ పోర్టుతోనే వెళ్లారని అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు.

తాను జర్మనీ పౌరసత్వం వదులుకున్నానని హైకోర్టుకు చెన్నమనేని నివేదించారు. భారత పౌరసత్వం ఉన్నప్పుడు జర్మనీ పాస్ పోర్టుతో ఎందుకు వెళ్లారని న్యాయస్థానం ప్రశ్నించింది. పౌరసత్వం వదులుకోవడానికి ఇచ్చిన దరఖాస్తును జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా అని చెన్నమనేని తరఫు న్యాయవాదిని అడిగింది. జర్మనీ పౌరసత్వం వదులుకున్నట్లయితే.. అక్కడి ప్రభుత్వ అధికారిక పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ను రెండు వారాలు పొడిగించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:చెన్నమనేని రమేశ్​ భారత్‌ పౌరుడు కాదు: కేంద్ర హోంశాఖ

Last Updated : Feb 10, 2020, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details