తెలంగాణ

telangana

ETV Bharat / state

జర్మనీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే రమేష్​ బాబు వార్తలు

వేములవాడలో 100 పడకల ఆస్పత్రిపై జర్మనీ నుంచి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్​ బాబు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్​ కృష్ణ భాస్కర్​, వైద్యాధికారులు పాల్గొన్నారు.

జర్మనీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఎమ్మెల్యే
జర్మనీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఎమ్మెల్యే

By

Published : May 26, 2021, 10:43 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్​ బాబు కోరారు. జర్మనీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్​ కృష్ణ భాస్కర్​, వైద్యాధికారులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.అంజయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందడం బాధాకరమని అన్నారు.

వంద పడకల ఆస్పత్రి అందుబాటులోకి రావడం ద్వారా నియోజకవర్గ ప్రాంత ప్రజలకు అత్యంత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఒక అంబులెన్సు ప్రత్యేకంగా ఆసుపత్రికి కేటాయించినట్లు తెలిపారు. వేములవాడ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే డాక్టర్లు వసతి కోసం తన ఇల్లు సంగీత నిలయాన్ని ఉపయోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చదవండి: బంగాల్​లో 'యాస్'​ కల్లోలం- నీట మునిగిన ఆలయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details