రాజన్నసిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇల్లంతకుంట మండలంలో పర్యటించారు. సిరికొండ, అనంతగిరి గ్రామాలను సందర్శించి అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రోడ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. బాధితులు అధైర్యపడొద్దని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇల్లంతుకుంటలో ఎమ్మెల్యే బాలకిషన్ పర్యటన - రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా వార్తలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటించారు. వర్షాలు, వరద నీటితో దెబ్బతిన్న పంటలను, ఇళ్లను, రోడ్లను పరిశీలించారు. బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
![ఇల్లంతుకుంటలో ఎమ్మెల్యే బాలకిషన్ పర్యటన ఇల్లంతుకుంటలో ఎమ్మెల్యే బాలకిషన్ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8540706-439-8540706-1598275833026.jpg)
ఇల్లంతుకుంటలో ఎమ్మెల్యే బాలకిషన్ పర్యటన
అనంతగిరిలో డ్రై కెనాల్ బ్లాస్టింగ్ పనులు, పోచమ్మ గుడి వద్ద వరద నీటిని పరిశీలించి... మోటర్లతో వరద నీటిని తొలగించాలని నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మండలంలో రహదారులు, కుంటల మరమ్మతుకు నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. అనంతారం బ్రిడ్జి, కల్వర్టులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వర్ణయుగం వచ్చింది'