రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన దగ్గర మిషన్ భగీరథ పైప్‌లైన్(mission bhagiratha water pipeline Leakage) లీకైంది. పైప్‌లైన్ లీకవడంతో నీరు ఉప్పొంగింది. రహదారిపై పెద్దఎత్తున నీరు ఎగిసిపడింది. నీరు ఉప్పొంగడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు గంట పాటు భగీరథ నీరు వృథా అయింది.
దీనితో విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తాత్కాలికంగా నీరు రహదారిపైకి రాకుండా కట్టడి చేశారు. మిషన్ భగీరథ అధికారులకు సమాచారం ఇచ్చి నీటి సరఫరాను నిలిపివేయాలని కోరారు. మరోవైపు లీకేజీ ద్వారా(mission bhagiratha water pipeline Leakage) ఎగిసిపడుతున్న నీటి దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఆ నీటి పక్కన ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు.