రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. బద్దెనపల్లిలోని టెక్స్టైల్స్ పార్కులో రూ. 14.50 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్ సిస్టం, పార్కు పరిపాలన భవనం, కార్మికుల కోసం నిర్మించిన క్యాంటిన్‌ను మంత్రి ప్రారంభించారు.
రాష్ట్రంలో జౌళి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: కేటీఆర్ - సిరిసిల్ల జిల్లా తాజా వార్తలు
రాష్ట్రంలో జౌళి పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లె టెక్స్టైల్స్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన
అనంతరం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పవర్ రూం, నిరుపేద కార్మికులకు నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేశారు. పార్కులో పరిశుభ్రత పాటించే విధంగా యజమానులు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. కార్మికులకు శౌచాలయాలతో పాటు ఇతర మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?
Last Updated : May 11, 2020, 3:49 PM IST