తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం - కేటీఆర్ పర్యటన

పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే తెరాస సర్కారు లక్ష్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

minister ktr
పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం

By

Published : Jun 16, 2021, 3:04 PM IST

రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కోట్ల విలువైన ఇళ్లను.. పైసా లంచం ఇచ్చే పనిలేకుండా లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో రెండు పడక గదుల ఇళ్లను సహచర మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే తెరాస సర్కారు లక్ష్యమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం... పేదవాడి ప్రభుత్వమని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మేం నిర్మించిన ప్రతి ఇల్లు ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. బోయిన్‌పల్లి మండంల కొదురుపాకలో రైతువేదిక ప్రారంభించనున్న కేటీఆర్.. కొదురుపాక చౌరస్తాలో నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన చేయనున్నారు.

పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం

ఇదీ చదవండి: తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

ABOUT THE AUTHOR

...view details