రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వసతి గృహంలో బాలికలను వేధింపులకు గురిచేసిన తమ నాయకులను సస్పెండ్ చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన దేవయ్యపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇవాళ మంత్రి రాజన్న సిరిసిల్లలో పర్యటించారు. అనంతరం ఎస్సీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు.
బాలికలను వేధిస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కేటీఆర్ - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు
సిరిసిల్లలోని ఎస్సీ వసతి గృహంలో బాలికలను వేధించిన దేవయ్యపై కఠిన చర్యలు తీసుకున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అలాగే తమ నాయకులను సస్పెండ్ చేశామని తెలిపారు.
బాలికలను వేధిస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కేటీఆర్
ఇలాంటి దురాగతాలపై అమ్మాయిలు గొంతెత్తాలని కేటీఆర్ సూచించారు. వసతి గృహాల్లో ఆత్మరక్షణ కోసం శిక్షణ శిబిరాన్ని చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి మరెక్కడా పునరావృతం కాకుడదని మంత్రి ఆకాంక్షించారు.
ఇవీ చూడండి:మహాశివరాత్రి స్పెషల్: వేములవాడకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం