తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్​ - సిరిసిల్లలో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి కేటీఆర్​ వార్తలు

పంద్రాగస్టును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయం వద్ద మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

minister-ktr-unveiling-the-national-flag-at-sirisilla
సిరిసిల్లలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్​

By

Published : Aug 15, 2020, 11:01 AM IST

Updated : Aug 15, 2020, 11:36 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో 74వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్​ కార్యాలయం ఎదుట నిర్వహించిన వేడుకల్లో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, అదనపు కలెక్టర్ అంజయ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, శిక్షణ కలెక్టర్ రిజ్వాన్ భాషా, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్​

ఇదీచూడండి: రాజ్​ఘాట్​కు మోదీ- మహాత్ముడికి నివాళి

Last Updated : Aug 15, 2020, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details