రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించారు. రూ.2 కోట్లతో కోళ్లమద్ది గ్రామంలో ప్రధాన ఫీడర్ ఛానల్లో పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. గంభీరావుపేటలో రైతు వేదిక, నర్మల్లో రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎలాంటి భయాందోళనలు వద్దని కరోనా సోకినా ఆందోళన చెందవద్దని సూచించారు. పూడికతీత పనులు పూర్తైతే వ్యవసాయానికి సాఫీగా సాగునీరు అందుతుందని హామీ ఇచ్చారు.
'అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన' - Minister KTR's visit to Rajanna Sirisilla
ఉపాధి హామీ పనులు చేసేటపుడు విధిగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఉపాధి హామీ కూలీలకు సూచించారు. రోజుకు ఏ మేరకు కూలీ గిట్టుబాటు అవుతుందో అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు.
'అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన'
సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. జోహార్ కర్నల్ సంతోష్ బాబు అంటూ కేటీఆర్ నినాదాలు చేశారు. కర్నల్ సంతోష్ బాబుకు సర్వసభ్య సమావేశం నివాళులర్పించింది. కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి జిల్లా అండగా ఉంటుందని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తొలి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి :సిటీ పోలీస్ రూపొందించిన 'కాప్స్ వర్సెస్ కొవిడ్ -19' లఘు చిత్రం