సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రికేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పరిసర ప్రాంతాల్లో వాతావరణం పచ్చదనంగా మార్చాలని మంత్రి సూచించారు. అందుకు అనుగుణంగా అవసరమైన మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల చుట్టూ ఎలాంటి అపరిశుభ్రతకు తావులేకుండా పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించాలని కేటీఆర్ ఆదేశించారు.
KTR: సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన... ఎందుకంటే.. - రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించిన కేటీఆర్
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
![KTR: సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన... ఎందుకంటే.. Minister KTR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12211599-778-12211599-1624270536618.jpg)
Minister KTR
రెండు పడక గదులు ఇళ్లు నిర్మించిన ప్రాంతంలో మంత్రి కేటీఆర్ కలియ తిరిగారు. చిన్నపిల్లలకు పార్కులో చెట్లు పెంచాలని సూచించారు. మరింత స్థలం ఉంటే ఆటస్థలంగా వినియోగించాలని తెలిపారు. అలాగే అక్కడ ఉండే పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల్పించవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.