సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో రైతు వేదిక భవనాన్ని, పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం మూడపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు. రైతు వేదికల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించి.. శాస్త్రవేత్తలతో మాట్లాడే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రంలో రైతు వేదికను, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మూడపల్లిలోని రైతువేదిక భవనాన్ని ప్రారంభించారు.
పేదల సంక్షేమానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా.. అధికారులు దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఒక గొప్ప ఆశయంతో రైతులను సంఘటితం చేసేందుకే కేసీఆర్ రైతువేదికల నిర్మాణానికి పూనుకున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ తనకు వేరుకాదని వెల్లడించారు. ఏ సమస్య వచ్చినా... తన వద్దకు రండి అని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల, వేములవాడలను జోడెద్దుల్లా పరుగెత్తిద్దామన్నారు. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం ఉన్నా.. మొదలు పెట్టిన ఏ పథకం ఆపలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్