తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: కాళేశ్వరం నీటితో త్వరలోనే కోనసీమలా సిరిసిల్ల: కేటీఆర్ - సిరిసిల్లలో నాలుగు వరుసల రహదారి

కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టామని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలా సిరిసిల్ల మారిందని పేర్కొన్నారు. సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

Minister KTR Started many development works in sircilla
సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు

By

Published : Jun 16, 2021, 7:49 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. విలాసాగర్​లో కోటి పది లక్షల రూపాయలతో ఎస్సారెస్పీ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వెదురుపాకలో కేడీసీసీబీ బ్యాంకు శాఖను ప్రారంభించారు. జిల్లాలోని బోయినపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. సిరిసిల్లలో ఆర్ అండ్ బీ అతిథిగృహం నిర్మాణానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ భూమిపూజ చేశారు

కొదురుపాక నుంచి నాలుగు వరుసల రహదారికి 20 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కొదురుపాకలో అమ్మమ్మ, తాతయ్య జ్ఞాపకార్థం కేటీఆర్ కట్టించిన రైతు వేదికను ప్రారంభించారు. రైతులను సంఘటితం చేసి మార్కెట్‌ను శాసించే స్థాయికి చేర్చాలనేదే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు.

ఇదీ చూడండి:తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు, 11 మరణాలు

ABOUT THE AUTHOR

...view details