Siricilla Kotha Cheruvu: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సిరిసిల్లలో ప్రత్యేకంగా కొత్త చెరువును ముస్తాబు చేశారు. చెరువుకు ఇరువైపులా జంతువులు, పక్షులతో కూడిన ఆకర్షణీయమైన ఆకారాలు రూపొందించారు. దాదాపు రెండుకిలోమీటర్ల మేర వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లను తీర్చిదిద్దారు. ట్రాక్ చుట్టూ గ్రీనరీ, లైటింగ్ ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా రైలు ట్రాక్‌ను పొందుపరిచారు. యోగశాల, క్యాంటీన్, పుట్టినరోజు వేడుకలు చేసుకునే ఓ వేదిక వంటి వసతులు కల్పించారు. జలాశయంలో విహరించేందుకు బోటింగ్ ఏర్పాటు చేశారు.
పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించే విధంగా... వినోదం పంచేందుకు దాదాపు మూడున్నర ఎకరాల్లో సకల సౌకర్యాలు కల్పించారు. పాత్ వేలు, బేబీ కేర్ సెంటర్, సీతాకోక చిలుకల గార్డెన్, చిట్టడివి, వ్యూ పాయింట్ డెక్, ల్యాండ్ స్కేపింగ్ వంటివి ఏర్పాటు చేశారు. కోటి రూపాయలతో జిప్ సైకిల్, జీప్ లైన్, క్రొకోడైల్ స్లయిడ్, కమాండో కోర్స్, డైనోసార్ వంటి పిల్లలను ఆకర్షించేలా ఆటల పరికరాలను అందుబాటులో ఉంచారు.