అక్టోబర్‌లోగా ప్యాకేజీ-9 ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12 పనులు దసరా కల్లా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మధ్యమానేరు నుంచి 85 శాతానికి పైగా చెరువులు నింపేలా చూడాలని పేర్కొన్నారు. జిల్లాలో రానున్న వర్షాకాలంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
అక్టోబర్‌లోగా ప్యాకేజీ-9 ద్వారా సిరిసిల్ల జిల్లాకు సాగునీరు - ktr latest news
పకడ్బందీ వ్యూహం, కార్యాచరణతో ముందుకు సాగితే... నియంత్రిత సాగు విధానం సత్ఫలితాలనిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మధ్యమానేరు నుంచి 85 శాతానికి పైగా చెరువులు నింపేలా చూడాలని అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12 పనులు దసరా వరకు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ktr
పకడ్బందీ వ్యూహం, కార్యాచరణతో ముందుకు సాగితే... నియంత్రిత సాగు విధానం సత్ఫలితాలనిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు సాధ్యమైనంత మేర ఎక్కువగా ప్రయోజనం కలిగించాలన్న ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో సాగుకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ విధానంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం నమూనాగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:'కేసీఆర్‌తో జగన్ భేటీ తర్వాతే ఏపీ జీవో ఇచ్చింది'
Last Updated : May 19, 2020, 8:39 PM IST