తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహా శివరాత్రి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు'

Minister KTR Review on Mahashivratri Arrangements: మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్ర అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిల్వనున్నాయని.. ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు.

ktr review
ktr review

By

Published : Feb 7, 2023, 3:59 PM IST

Minister KTR Review on Mahashivratri Arrangements: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి వేడుకలపై మంత్రి కేటీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్​లో జరిగిన ఈ సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్​ బాబుతో పాటు కలెక్టర్​ అనురాగ్​ జయంతి, రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు, ఆర్​ అండ్​ బీ అధికారులు పాల్గొన్నారు. మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్ర అభివృద్ధిపై కేటీఆర్ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ సూచించారు. ముఖ్యంగా ఉత్సవాల సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముందస్తు జాగ్రత్తగా అదనపు అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిల్వనున్నాయన్న ఆయన.. ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు.

అవసరమైన ప్రతిపాదనలను పంపించండి..: సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై అతి ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీల నిర్మాణం, అడ్వెంచర్ గేమ్స్, వేములవాడ శివారులోని నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్​ తెలిపారు. రాజన్న ఆలయానికి అనుసంధానంగా ఉన్న సంస్కృత పాఠశాలకు అనుబంధంగా నృత్య పాఠశాల, సంగీత పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు.. వాటికి ప్రత్యేకంగా భవన నిర్మాణాలు చేపడతామన్నారు. అత్యున్నత ప్రమాణాలతో వేములవాడ యువత కోసం మినీ స్టేడియం నిర్మాణం తొందరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కొదురుపాక నుంచి వేములవాడ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం, నాంపల్లి గుట్టపై రెండో ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

''శివరాత్రి వేడుకల దృష్ట్యా రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి. వేములవాడలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిల్వనున్నాయి. ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలి. వేములవాడను యాదాద్రి ఆలయం తరహాలో అభివృద్ధి చేస్తాం. రామప్ప గుట్టపై ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీలు నిర్మిస్తాం. నాంపల్లి గుట్టపై కేబుల్‌కార్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం.'' - అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్

ఇవీ చూడండి..

భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?

శ్రీశైల మల్లన్న దర్శనానికి ​ఆర్టీసీ ప్రత్యేక బస్​ సర్వీసులు

ABOUT THE AUTHOR

...view details