Ktr: అడిషనల్ కలెక్టర్ ఆర్.అంజయ్యకు కేటీఆర్ నివాళులు - మంత్రి కేటీఆర్ నివాళులు
ఇటీవల కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్.అంజయ్య చిత్రపటానికి మంత్రి కేటీఆర్ (Ktr)… కలెక్టరేట్ కార్యాలయంలో పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మంచి అధికారిగా… ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందించారని గుర్తు చేసుకున్నారు.
ఇటీవల కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్.అంజయ్య చిత్రపటానికి మంత్రి కేటీఆర్ (Ktr)… కలెక్టరేట్ కార్యాలయంలో పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మంచి అధికారిగా… ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందించారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన మండల విద్యాధికారి మంకు రాజయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.