తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ ఇస్తే పరిపాలించే సత్తా ఉందా అన్నారు.. ఇప్పుడు దేశానికే దిక్సూచిగా మారాం' - బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలు

KTR Participated In BRS Atmiya Sabha AT Sirisilla: తాను ముఖ్యమంత్రి కొడుకునే అయినా మీ ఆశీర్వాదం వల్లనే.. ఇక్కడ కూర్చునే అవకాశం కలిగిందని కేటీఆర్​ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్​ మండలం మద్దికుంటలో జరిగిన బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్​ హాజరయ్యారు. మోదీ వచ్చి గల్లీ గల్లీ తిరిగినా ఎవరూ బీఆర్​ఎస్​ గెలుపును ఆపలేరని మంత్రి కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు.

KTR
KTR

By

Published : Apr 12, 2023, 8:06 PM IST

Updated : Apr 12, 2023, 8:42 PM IST

KTR Participated In BRS Atmiya Sabha AT Sirisilla: తెలంగాణ ఇస్తే పరిపాలించే సత్తా ఉందా అని గేలి చేసేవారని.. కాని ఇప్పుడు పాలనలో దేశానికే దిక్సూచిగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్​ మండలం మద్దికుంటలో జరిగిన బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్​, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ సిరిసిల్ల ప్రజానికంతో మమేకమై.. వారి వద్దకు వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు.

తాను ముఖ్యమంత్రి కొడుకును అయినా మీ ఆశీర్వాదం వల్లనే.. ఇక్కడ కూర్చునే అవకాశం కలిగిందని కేటీఆర్​ పేర్కొన్నారు. ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేను.. నా తల్లి నాకు జన్మనిస్తే.. రాజకీయ జన్మ ఇచ్చింది మాత్రం సిరిసిల్ల, ముస్తాబాద్​ ప్రజలే అని అభివాదం చేశారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా సరే.. సిరిసిల్ల ఎమ్మెల్యే అంటున్నారు తప్ప.. ఇంకొక్కటి కాదన్నారు. మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే అయినా.. మంత్రి అయినా.. మీరిచ్చిన దీవెనలే.. నన్ను ఇంతటి వాడిని చేశాయన్నారు.

నీళ్లు, కరెంటు గోస మరిచారా: దేశవ్యాప్తంగా.. తెలంగాణ కంటే ఎక్కువగా ఎక్కడ పాలిస్తున్నారో చెప్పమంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి దగ్గర సమాధానం లేదని మండిపడ్డారు. రాష్ట్రం రాకముందు మంచి నీళ్లు.. కరెంటుకు ఎంత గోస ఉండే మరిచిపోయారా అని గుర్తు చేశారు. మొన్ననే 11 గ్రామాల్లో తిరిగి మంచి నీళ్ల సమస్య ఉందా అని ప్రతి ఒక్కరిని అడిగా.. ఏ ఒక్కరు సమస్య ఉందని చెప్పలేదన్నారు. కరెంటు, నీళ్లు ఇవ్వడం సునాయాసమైతే .. ఇంతకు ముందు పాలించే వాళ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతు చనిపోతే బీమా ఇవ్వమని ఎవరైనా అడిగారా.. కాని సంవత్సరానికి రూ.1500 కోట్లు కట్టి బీమా ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ కాదా అని వ్యాఖ్యానించారు.

మొహినికుంటలో సెంటిమెంట్​కు భూమి కొందామని అనుకుంటే ఎకరానికి రూ.40 లక్షలు అన్నారు.. కాని తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు పెరిగాయా లేదా అని అన్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తేనే కదా మన భూములకు ధరలు పెరిగాయన్నాయి. గతంలో ఎకరా రూ.20వేలు ఉంటే ఇప్పుడు రూ.40 లక్షలకు పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

"అప్పులు ఆకాశంలో, అవినీతి ఆకాశంలో అదానీ ఆకాశంలో కాని సామాన్యుడు మాత్రం పాతాళంలోకి పోతున్నాడు. కేవలం మతాన్ని అడ్డ పెట్టుకుని రాజకీయం చేయడం తప్ప.. చేసిన ఒక్క మంచి పని చెప్పుతావా నరేంద్రమోదీ గారూ అంటున్నాను. మేము మోదీ గారి లాగా పెద్దవాళ్లకు రూ.12 లక్షల కోట్ల లోన్​లు మాఫీ చేసే పని చేయలేదు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్​ కొట్టిన సీఎం కేసీఆర్​ అవుతారు.. మోదీ వచ్చి గల్లీగల్లీ తిరిగిన బీఆర్​ఎస్​ గెలుపు ఖాయం." - కేటీఆర్​, మంత్రి

మోదీ వచ్చి గల్లీ గల్లీ తిరిగినా ఎవరూ బీఆర్​ఎస్​ గెలుపును ఆపలేరన్న మంత్రి కేటీఆర్​

ఇవీ చదవండి:

Last Updated : Apr 12, 2023, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details