తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: 'దళితబంధు మేమిస్తున్నాం.. మిగతా వారికి కేంద్రం ఇవ్వాలి' - Minister Ktr News

KTR Participated Ambedkar Jayanthi Celebrations: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పలు గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించారు. అంబేడ్కర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కేవలం అంబేడ్కర్ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.

KTR
KTR

By

Published : Apr 14, 2022, 3:54 PM IST

Updated : Apr 15, 2022, 3:46 AM IST

'దళితబంధు మేమిస్తున్నాం.. మిగతా వారికి కేంద్రం ఇవ్వాలి'

KTR Participated Ambedkar Jayanthi Celebrations: రాజ్యాంగబద్ధమైన సంస్థలను కేంద్రం ఆధీనంలో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతోందని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దళిత బంధు తాము అమలు చేస్తున్నామని మిగతా వారికి కేంద్రం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఎస్సీలలోనే కాదని, మిగతా వర్గాల్లోనూ పేదలున్నారని, వారందరికీ దళితబంధు వర్తింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లవుతోంది. మాది చిన్న ప్రభుత్వం. ఇక్కడ దశల వారీగా దళితబంధు అమలు చేస్తున్నాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మిగతా సామాజిక వర్గాలకు ఇలాంటి పథకం అమలు చేయాలి. ప్రతిపక్షాలు కూడా ఇదే కోరాలి’’ అని అన్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి, మల్లాపూర్‌, అంకుసాపూర్‌, లక్ష్మీపూర్‌లలో ఆయన విగ్రహాలను ఆవిష్కరించారు. తంగళ్లపల్లిలో రూ.50 లక్షలతో నిర్మించే అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. తర్వాత సిరిసిల్ల పట్టణంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన అంబేడ్కర్‌ భవనాన్ని ప్రారంభించారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడే దళిత బంధు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి.. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

ఉన్నవి రెండే కులాలు...

ప్రపంచంలో పైసలున్నోడు.. లేనోడు అనే రెండే కులాలున్నాయని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని, వాటిని అందిపుచ్చుకొని ముందుకెళ్లే నైపుణ్యం మనమే కల్పించుకోవాలని సూచించారు.

నా మిత్రుని కులం తెలియదు..

‘‘నేను నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ఇద్దరు మిత్రులున్నారు. ఒకరు జాక్సన్‌. క్రిస్మస్‌ పండుగకు వారింటికి వెళ్తూండటంతో అతను క్రిస్టియన్‌ అని తెలిసింది. సుమిత్‌ అనే మరో స్నేహితుడు ఒక రోజు నా వద్దకు వచ్చి ‘మా అక్క ఆర్టీసీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. మీనాన్నతో చెప్పాల’ని కోరాడు. అప్పుడు మా నాన్న రవాణాశాఖ మంత్రి. మానాన్న విషయం పీఏకు చెప్పారు. కొద్దిసేపటికి పీఏ వచ్చి అది రిజర్వు కోటాలోని పోస్టు అని చెప్పారు. అప్పుడు ఫోన్‌ చేసి అడిగితే మేం ఎస్సీలమని సుమిత్‌ చెప్పాడు. అప్పటి వరకు వాళ్ల కులం ఏమిటో నాకు తెలియదు’’ అని కేటీఆర్‌ వివరించారు. సుమిత్‌ది జగిత్యాల జిల్లా కాగా, జాన్సన్‌ అమెరికాలో ఐటీ కన్సల్టెంట్‌గా పని చేస్తూ వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని తెలిపారు.

జరిగిన అభివృద్ధిని కూడా చెప్పాలి..

ఐదేళ్ల క్రితం అంబేడ్కర్‌ జయంత్యుత్సవాలకు వచ్చినపుడు సిరిసిల్ల పట్టణంలో నన్ను ఐదు గంటలు కూర్చోబెట్టి సమస్యల గురించి ప్రస్తావించారు. ఇప్పుడూ అలాగే మాట్లాడుతున్నారు. ఉపన్యాసాలు చెప్పేవారు జరిగిన అభివృద్ధిని కూడా ప్రస్తావించాలి. పదేళ్ల క్రితం సిరిసిల్ల ఎలా ఉంది? ఇప్పుడు ఎలాఉందో ఒకసారి గుర్తుచేసుకుని మాట్లాడాలి. రాజకీయంగా వైరుధ్యాలు ఉండవచ్చు కానీ మంచి పనులు చేసినపుడు గుర్తుచేయాలి’’ అని కోరారు.

కేసీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: మంత్రి గంగుల

భూమ్మీద గాలి, నీరు ఉన్నంతకాలం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు గుర్తుంటుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గురువారం కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రూ.94.84 కోట్లతో కొనుగోలు చేసిన 769 వాహనాలను 1,041 మంది లబ్ధిదారులకు అందజేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 15, 2022, 3:46 AM IST

ABOUT THE AUTHOR

...view details