ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో పర్యటించారు. రైతుబంధు విషయంలో దుష్ప్రచారాలను రైతులు నమ్మొద్దని కోరారు. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను పండించాలనే ఉద్దేశంతోనే నియంత్రిత పంటలసాగును సీఎం సూచిస్తున్నారని తెలిపారు.
రైతుబంధుపై దుష్ప్రచారం నమ్మొద్దు: కేటీఆర్ - ktr latest news
రైతుబంధు విషయంలో దుష్ప్రచారాలను రైతులు నమ్మొద్దని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఆయన పర్యటించారు.
అందరూ ఒకే రకమైన పంటలు వేస్తే సరఫరా పెరిగి డిమాండ్ తగ్గుతుందని చెప్పారు. పంటల సాగు విషయంలో సీఎం చేసేది సూచనలు మాత్రమే... ఆదేశాలు కాదని స్పష్టం చేశారు. రైతుల బాగు కోసం సూచించిన పంటలసాగుపై కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. రైతుబంధు కింద గతంలో వచ్చినంత సొమ్ము ఈ ఏడాది కూడా రైతులకు అందుతుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయని పనిని సీఎం కేసీఆర్ ఆరేళ్లలో చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్