KTR Baddena Tour: రైతులను సంఘంటితం చేసి.. దేశానికి అన్నదాతల శక్తిని చాటేందుకే రైతు వేదికలను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2వేల 603 రైతు వేదికలు నిర్మాణం చేసి అన్నదాతలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందేలా రైతు వేదికలు మేలు చేస్తాయన్నారు. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా కల్పిస్తూ అన్నదాతల కుటుంబానికి ధీమా ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఓబులాపురంలో సమ్మక్క-సారలమ్మను మంత్రి కేటీఆర్ దర్శించుకున్నారు.